రేవంత్ రెడ్డి కోరికని నెరవేర్చిన ప్రభాస్
on Dec 31, 2024
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(the raja saab)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.2025 ఏప్రిల్ 10 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న ఈ మూవీకి మారుతీ(maruthi)దర్శకుడు కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజె విశ్వప్రసాద్(tj viswaprasad)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.సలార్ 2 ,స్పిరిట్, ఫౌజీ అనే చిత్రాలు కూడా ప్రభాస్ లిస్ట్ లో ఉన్నాయి.వాటికీ సందీప్ రెడ్డి వంగ(sundeep reddy vanga)ప్రశాంత్ నీల్(prashanth neel)హను రాఘవపూడి(hanu raghavapudi)దర్శకత్వం వహిస్తున్నారు
రీసెంట్ గా సినిమాలకి సంబంధం లేకుండా ప్రభాస్ ఒక వీడియో రిలీజ్ చేసాడు.అందులో ఆయన మాట్లాడుతు లైఫ్ లో మనకి బోలెడన్ని ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి.కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంది.మనల్ని ప్రేమించే మనుషులు,మన కోసం బతికే మన వాళ్ళు ఉన్నప్పుడు 'డ్రగ్స్' అవసరమా డార్లింగ్స్.సే నో టూ డ్రగ్స్ .మీకు తెలిసిన వాళ్ళెవరైనా డ్రగ్స్ కి బానిసలైతే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయమని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ ని కూడా సదరు వీడియోలో ఇవ్వడం జరిగింది.వాళ్ళు పూర్తిగా కోలుకునే దాకా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కూడా తన సందేశంలో తెలిపాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)తరచు కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సినిమా హీరోలందరూ కలిసి రావాలని చెప్తున్న దృష్ట్యా ఇప్పడు ప్రభాస్ తన వంతు బాధ్యతని నిర్వహించినట్లయ్యింది.
Also Read