ప్రభాస్, సాయిపల్లవి కాంబో ఫిక్స్ అయ్యిందా!
on Jan 28, 2026

-సాయిపల్లవి రేంజ్ పెరగబోతుందా!
-మేకర్స్ సాయిపల్లవి వైపు మొగ్గు చూపడానికి కారణం
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
ఓవర్ నైట్ ఏ అద్భుతమైన జరగచ్చనే నానుడి సినిమా ఇండస్ట్రీకి మాత్రమే దక్కిన పేటెంట్ వర్డ్ . సదరు పేటెంట్ వర్డ్ ప్రధానంగా హీరో, హీరోయిన్,దర్శకుడు చుట్టూ వైఫై లా తిరుగుతుంటుంది. మంచి ఆఫర్ రావడం లేదా ఒకరి అవకాశాలని ఒకరు అందుకోవడమే అద్భుతం యొక్క ప్రధాన కాన్సెప్ట్. ఇప్పుడు ఆ అద్భుతం సాయిపల్లవి విషయంలో జరగబోతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియా సాక్షిగా చక్కర్లు కొడుతుంది. మరి పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
ఇండియన్ సినీ సెల్యులాయిడ్ పై కల్కి 2898 ఏడి సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. దీంతో పార్ట్ 2 ని పార్ట్ 1 కి మించి ప్రభంజనాన్ని సృష్టించేలా నాగ్ అశ్విన్(Nag ashwin)అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకు తగ్గట్టే నో కాంప్రమైజ్ అనే విధంగా పార్ట్ 2 ఉండబోతుంది. కాస్టింగ్ పరంగా చూసుకుంటే పార్ట్ 1 కథ ప్రకారం దీపికా పదుకునే(Deepika Padukune)ఖచ్చితంగా పార్ట్ 2 లో ఉండాల్సిందే. ఆమె పోషించిన క్యారక్టర్ సుమతి కడుపులోని బిడ్డ చుట్టూనే పార్ట్ 2 తిరగబోతుంది. కానీ కొన్ని కారణాల వల్ల పార్ట్ 2 నుంచి దీపికా ని తప్పించారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో సాయి పల్లవి ని ఫిక్స్ చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే మాటలు సినీ సర్కిల్స్ లో జోరుగా జరుగుతున్నాయి. సుమతి క్యారక్టర్ కి సాయి పల్లవి(saipallavi)హండ్రెడ్ పర్శంట్ న్యాయం చేస్తుందని, ఇక నెక్స్ట్ ఆప్షన్ తీసుకోకూడదని మేకర్స్ చాలా బలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.
Also read: అప్పుడే ఓటిటి లోకి రాజా సాబ్.. ఫ్యాన్స్ కి పండగే
ఈ న్యూస్ పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తూ దీపికా ప్లేస్ ని సాయి పల్లవి ఖచ్చితంగా భర్తీ చెయ్యగలదు. ఇంకా చెప్పాలంటే ప్రభాస్, సాయి పల్లవి స్క్రీన్ ప్రెజ న్స్ పార్ట్ 2 విజయం యొక్క రేంజ్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. పైగా సాయి పల్లవి ఇప్పడు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'రామాయణ' లో సీతమ్మ తల్లిగా చేస్తుంది. దీంతో సాయిపల్లవి రాక కల్కి పార్ట్ 2 కి అదనపు ఆకర్షణ అవుతుందని అంటున్నారు. మరి పార్ట్ 2 లో సాయి పల్లవి చేస్తుందనే న్యూస్ రూమర్ గానే ఉంటుందా లేక అధికార హోదా దక్కించుకుంటుందా అనేది చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



