అందుకే ప్రభాస్‌ని అందరూ ‘డార్లింగ్’ అని పిలుస్తారు : పృథ్విరాజ్
on Dec 16, 2023
సలార్ ప్రభంజనం మొదలయ్యేందుకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉంది. ఈలోగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రంలో హీరో స్నేహితుడిగా నటించిన పృథ్విరాజ్ సుకుమారన్ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు. ప్రభాస్‌ను డార్లింగ్ అని అందరూ ఎందుకు పిలుస్తారో తనకు షూటింగ్ టైమ్‌లోనే అర్థమైందని తెలిపారు. అతనికి ఎంతో త్వరగా తాను స్నేహితుడిగా మారిపోయానని అన్నారు. ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతుక్కునే గిఫ్ట్ ప్రభాస్‌కి ఉంది. సెట్‌లో అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందరూ మంచి ఆహారం తీసుకునేలా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటారు. ఇతరుల పట్ల అతను తీసుకునే కేర్ చూసిన తర్వాత అందరూ అతన్ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది. తాను తరచూ మెసేజ్‌లు చేసే అతి తక్కువమంది స్నేహితుల్లో ప్రభాస్ ఒకరు.
కేజీఎఫ్ 2 సమయంలోనే ప్రశాంత్ నీల్ తనకు సలార్ కథ చెప్పారని పృథ్విరాజ్ సుకుమారన్ తెలిపారు. ఇటీవలి కాలంలో తాను విన్న గొప్ప స్క్రిప్ట్ ఇదే అనిపించిందని అన్నారు. తనను వరదరాజగా ప్రశాంత్ ఊహించుకున్నందుకు సంతోషంగా అనిపించిందన్నారు. ఈ చిత్రం చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు పృథ్విరాజ్.
ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఎ సర్టిఫికెట్ లభించింది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండడం వల్లే ఎ సర్టిఫికెట్ వచ్చిందని తెలుస్తోంది. 2 గంటల 55 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
