పవర్‌స్టార్ సినిమా చూస్తే ..బిర్యానీ ఫ్రీ..!
on Sep 26, 2016

చిత్ర నిర్మాతలు తమ సినిమాల కలెక్షన్లు పెంచుకునేందుకు విపరీతమైన ప్రచారంతో పాటు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. గిఫ్ట్ కూపన్లని, కార్లు, లక్కీ డ్రా.. ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఈ విధంగా ప్రేక్షకులకు ఎర వేసి కాసుల పంట పండించుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. దీనిలో భాగంగానే పవర్‌స్టార్ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన వాళ్లకి బిర్యానీ ఆఫర్ ఒకటి హల్‌చల్ చేస్తోంది.

పవర్‌స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అనుకునేరు..కాదు కాదు, కన్నడ పవర్‌స్టార్ పునిత్ రాజ్‌కుమార్. ఆయన నటించిన "దొడ్మనేహుడుగ" ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఆ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ కొంటే..బిర్యానీతో పాటు లడ్డూలు కూడా పంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అల్రెడీ ఇందుకు సంబంధించిన ప్రకటనలు కూడా వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే కర్ణాటకలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పునీత్ సినిమా కోసం బిర్యానీ ఆఫర్ పెట్టాల్సిన అవసరం ఏమోచ్చిందా అని ఈ వార్త శాండిల్ వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



