పవన్ క్షుద్రపూజలు నిజమేనా..?
on Jan 8, 2018

పవన్ అభిమానులకు, కత్తి మహేశ్‌కు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పటివరకు పవన్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు ఇచ్చిన కౌంటర్లకు సోషల్ మీడియాలోనే సమాధానాలిచ్చిన కత్తి.. ఈ ఆదివారం మాత్రం తన రూట్ మార్చాడు...11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లోనే చూసుకుంటా.. దమ్ముంటే నా ముందుకు రండి.. మీరో నేనో తేల్చుకుందాం అంటూ.. పవన్‌కళ్యాణ్, పూనమ్‌కౌర్‌లకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
ఇక్కడ మీడియా సాక్షిగా కత్తి సంధించిన ఆరు ప్రశ్నలు తెలుగునాట సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. వాటిలో ఒకటి క్షుద్రపూజలు.. పవన్, త్రివిక్రమ్ కలిసి క్షుద్రపూజలు చేశారని.. ఆ సమయంలో పూనమ్ అక్కడే వున్నారని.. అందుకు సంబంధించిన ప్రూఫ్ తన వద్ద ఉందని.. ఆ పూజలు నిర్వహించిన పూజారి నరసింగం పేరు కూడా చెప్పాను కదా... కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అంటూ సవాల్ విసురుతున్నాడు కత్తి.
అసలు పవన్, త్రివిక్రమ్‌లకు క్షుద్రపూజలు చేయాల్సిన అవసరం ఏంటీ..? ఎందుకోసం వారు ఈ పని చేశారు..? అసలు పవన్ ఇలాంటి వాటిని నమ్ముతారా..? వంటి ప్రశ్నలతో సోషల్ మీడియా హోరేత్తిపోతోంది. ఈ సమయంలోనే ఒక వాదన వినిపిస్తోంది. కుటుంబ సమస్యలు, వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పవన్ ఒకానొక స్టేజ్‌లో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన విషయం టాలీవుడ్‌లో ఓపెన్ టాక్. బయటకు రాకుండా కేవలం ఫాం హౌస్‌కే పరిమితమవ్వడం అందరికి తెలిసిందే. ఈ సమస్యల నుంచి బయటకు రావడానికి ఎవరో ఇచ్చిన సలహా మేరకు పవన్, త్రివిక్రమ్ క్షుద్రపూజలు చేశారా..? అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పవన్, త్రివిక్రమ్ అసలు ఇలాంటి ప్రయత్నం చేశారో లేదో తెలియదు..? అది తెలియాలంటే కత్తి మహేశ్ తన వద్ద ఉన్న ఆధారాన్ని చూపించాలి..? మరి ఆయన చూపిస్తారా..? ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



