పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్పెషల్ షోలకి ఏపీ పచ్చజెండా
on Jan 7, 2018
.jpg)
ఇప్పుడైతే తగ్గింది కానీ ఒకప్పుడు తెలుగునాట స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ సందడి మాములుగా ఉండదు. విడుదలకు వారం ముందు నుంచే థియేటర్లను అలంకరించడం.. కటౌట్లు, బ్యానర్లు అబ్బో రచ్చ రచ్చే. దానికి తోడు అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా బెనిఫిట్ షోలతో థియేటర్లు కళకళలాడిపోయేవి. కానీ శాంతిభద్రతలతో పాటు మరికొన్ని పరిస్థితుల కారణంగా ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేసింది. వీటిని తిరిగి పునరుద్ధరించాలని సినీ పెద్దలతో పాటు రాజకీయనాయకులు లాబీయింగ్ చేసినప్పటికీ ప్రభుత్వం ససేమిరా అంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ అభిమానులకి గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు స్పెషల్ షోలకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10 నుంచి 17 వరకు ప్రత్యేక ప్రదర్శనలు వేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



