పవన్ పాదాలకు నమస్కరించిన హీరోయిన్!
on May 2, 2016
.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకున్న పవర్ అంతా ఇంతా కాదు. వ్యక్తిగతంగానూ..వృత్తిగతం గానూ తన ప్రవర్తన ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవన్. సామాన్యులే కాదు..ప్రముఖులు కూడా ఆయన్ను అభిమానిస్తారు...ఆరాధిస్తారు. తాజాగా పవన్ వీరాభిమాని నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సినిమాలో ఒక హీరోయిన్‌గా చేసిన మళయాళీ ముద్దుగుమ్మ "అనుపమ పరమేశ్వరన్"ను సాంగ్ లాంఛ్‌కి స్టేజ్ మీదకు ఆహ్వానించింది యాంకర్ సుమ. అనుపమ స్టేజ్ మీదకు వస్తుండగా ముందు వరుసలో కూర్చోని ఉన్న పవన్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. పవన్ వద్దని వారించినా ఆమె ఆయన కాళ్లు వదల్లేదు. అంతేకాదు స్టేజ్ మీద మాట్లాడుతూ పవర్ స్టార్‌ని ఆకాశానికెత్తేసింది. ఒక్కసారి మళయాళంలో నటించాలని కోరింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



