'హ్యాపీ బర్త్ డే ప్రేరణ'.. 'రాధేశ్యామ్' నుంచి కొత్త పోస్టర్
on Oct 13, 2021
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రాధేశ్యామ్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. నేడు(అక్టోబర్ 13) పూజా హెగ్డే బర్త్డే సందర్భంగా మూవీ టీమ్ ఆమెకు బర్త్డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'రాధేశ్యామ్' మూవీలో ప్రేరణ అనే పాత్రలో పూజ కనిపించనుంది. దీంతో 'హ్యాపీ బర్త్ డే ప్రేరణ' అంటూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పూజ వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉంది. రాధేశ్యామ్ నుండి తాజాగా విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అక్కినేని అఖిల్ కి జోడీగా ఆమె నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ దసరా కానుకగా ఈ నెల 14న థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే తెలుగులో ఆచార్య, తమిళ్ లో బీస్ట్, హిందీలో సర్కస్ సినిమాలలో నటిస్తోంది.
Also Read