' పోలీసోడు ' రిలీజ్ ఒకరోజు పోస్ట్ పోన్..!
on Apr 12, 2016
తమిళ ఇళయదళపతి విజయ్ నటించిన పోలీస్ జానర్ మూవీ తేరీ. తెలుగులో పోలీసోడు గా దిల్ రాజు తీసుకొస్తున్నారు. విజయ్ కు సూర్య, కార్తి, విక్రమ్ లాంటి వాళ్లతో పోలిస్తే, తెలుగులో ఇంకా పెద్ద మార్కెట్ క్రియేట్ అవలేదు. వాళ్లందరూ ఇక్కడ స్టార్స్ అయిపోయినా, విజయ్ మాత్రం ఇంకా ఒక సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తుపాకీ, అన్న లాంటి సినిమాలు ఫర్వాలేదనిపించినా, విజయ్ కు పూర్తి తెలుగు గుర్తింపును తీసుకురాలేకపోయాయి. ఈ వారం రాబోతున్న తన పోలీసోడు సినిమా మీదే ఇప్పుడు విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఏప్రిల్ 14 న రిలీజ్ అవుతుందని ప్రకటించిన దిల్ రాజు ఇప్పుడు తెలుగు రిలీజ్ డేట్ లో చిన్న మార్పు చేశారు. తమిళంలో 14 నే వస్తున్నా, తెలుగులో మాత్రం ఏప్రిల్ 15 న రిలీజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో తమిళంలో తేరీ రిలీజైన ఒకరోజు తర్వాత తెలుగులో పోలీసోడు రిలీజ్ కానుంది. తమిళ్ లో వచ్చిన టాక్ తెలుగులో కూడా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుందడంలో మాత్రం సందేహం లేదు. రాజారాణి ఫేం అట్లీ తెరకెక్కించిన పోలీసోడులో సమంత, అమీ జాక్సన్లు హీరోయిన్లుగా నటించారు.