CM స్నేహితుడి కుమార్తెతో రాజ్ తరుణ్ ఎఫైర్... లావణ్యకి నోటీసులు
on Jul 6, 2024
గత 24 గంటలుగా సంచలనం సృషిస్తున్న రాజ్ తరుణ్, లావణ్య కేసు కొత్త మలుపు తిరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది లావణ్య. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో సహజీవనం చేశాడని, ఇప్పుడు ఓ హీరోయిన్ మోజులో పడి తనని పట్టించుకోవడం లేదని, తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని ఆరోపించింది. తనకు రాజ్ తరుణ్ కావాలని, అతన్ని తనకు అప్పగించాలంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, ఆ ఫిర్యాదులో రాజ్‌తరుణ్‌పై పలు ఆరోపణలు చేసింది లావణ్య.
ఇదిలా ఉంటే ఈ కేసులో ఓ కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేమిటంటే.. పోలీసులు లావణ్యకి నోటీసులు పంపించారు. దానికి కారణం..రాజ్‌తరుణ్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారలేవీ సమర్పించుకుండా కేవలం నాలుగు పేజీల ఫిర్యాదును మాత్రమే ఇచ్చి వెళ్లిపోయిందట లావణ్య. ఆధారాలు సమర్పించాలని కోరేందుకు ఆమెకు పలుమార్లు ఫోన్ చేశారు పోలీసులు. కానీ, ఆమె ఆన్సర్ చేయకపోవడంతో నోటీసులు జారీ చేశారు. ఆమె నివసిస్తున్న విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం వల్ల ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు. అంతేకాదు, గత మూడు రోజులుగా ఆమె అక్కడ ఉండడం లేదని స్థానికులు చెప్పినట్టు తెలుస్తోంది.
నిన్న మీడియా ముందు అంత హడావిడి చేసి ఇప్పుడు కనిపించకుండా పోయిన లావణ్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆమె ఆరోపణల్లో నిజం ఉందా లేక అతన్ని బెదించడానికి, బ్లాక్‌మెయిల్ చెయ్యడానికి అలా చేసిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రాజ్ తరుణ్‌కు ముఖ్యమంత్రి స్నేహితుడైన ఓ వ్యక్తి కుమార్తెతో కూడా సంబంధాలు వున్నాయని, అలాగే చాలా మంది అమ్మాయిలతో అతనికి రిలేషన్ ఉందనే విషయాన్ని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. అయితే వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఆమె సమర్పించకపోవడం, విచారణకు అందుబాటులో లేకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇదే కాకుండా కొన్ని రోజుల్లో రాజ్ తరుణ్ కొత్త సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా రిలీజ్‌ని అడ్డుకునేందుకు, తనకు చెడ్డపేరు తెచ్చేందుకే అలా చేస్తోందని రాజ్ తరుణ్ చెప్పిన మాటలు నిజమే అనిపించేట్టుగా లావణ్య ప్రవర్తన ఉండడంతో పోలీసులు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోపక్క లావణ్య తనపై కేసుపెట్టి పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్ మీడియాతో సమావేశమై వివరణ ఇచ్చారు. లావణ్య చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలనీ, సహజీవనం చేసిన మాట వాస్తవమే కానీ, ఆమె ప్రవర్తన నచ్చకపోవడం వల్లే తాను ఆమెకు దూరంగా ఉంటున్నానని తెలియజేశారు. ఆమె వల్ల తను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, లీగల్ ఎడ్వయిజర్‌తో కలిసి ఆ ఆధారాలు పోలీసులకు సమర్పిస్తానని తెలిపారు. ఈరోజు రాజ్ తరుణ్ నార్సింగి పోలీసుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది.
Also Read