'పెళ్లిచూపులు' ఖాతాలో మరో రికార్డు..
on Sep 17, 2016
పెళ్లి చూపులు సినిమా ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లి చూపులు పెద్ద హిట్ కొట్టడమే కాక.. రికార్డులు సొంతం చేసుకుంటుంది. ఈ మధ్య వచ్చిన పెద్ద పెద్ద హీరోల సినిమాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టగా.. ఈ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. ఇక్కడే కాదు యూఎస్ఏలో కూడా ఈసినిమా మంచి పేరు తెచ్చుకుంది. యూఎస్ఏఏలో ఏకంగా పది థియేటర్లలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమా ఈ ఘనత ఏ సినిమా సాధించలేదు. స్టార్ ఎట్రాక్షన్ లేకపోయినా.. కేవలం కథా కథనాలను నమ్ముకొని తెరకెక్కించిన పెళ్లి చూపులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లోనూ చరిత్ర సృష్టించింది. మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.