Home

»

Latest News

Peddi: లుక్ వెనక ఉన్న అసలు రహస్యం ఇదే.. ఈ ఫుడ్ తింటే మీకు కూడా పక్కా

Mar 31, 2026

 

-పహిల్వాన్ లుక్ తో ఆల్ రికార్డ్స్ బద్దలు 
-అసలు పెద్దికి బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ లుక్ ఎలా వచ్చింది!
-చేసిన వ్యాయామాలు ఏంటి!
-తీసుకున్న ఫుడ్ 
-మరి పెద్ది రహ్యసం ఏంటో చూద్దాం

స్టిల్ మెగాఫ్యాన్స్ తో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకుల మస్తిష్కాలు రోజువారి దినచర్యలో బిజీగా ఉన్నాయి. అదే టైంలో వాళ్ల మస్తిష్కాల్లో పెద్ది(Peddi)బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ లుక్ కూడా కదలాడుతూనే ఉంది. అదేనండి.. కండలు తిరిగిన దేహంతో ఇటీవల రిలీజైన పెద్ది పహిల్వాన్ లుక్. పెద్దిని ఒక రేంజ్ లో ఎలివేషన్ చేసిన సదరు లుక్ ఇప్పుడు సోషల్ మీడియాని ప్రశాంతంగా ఉండనివ్వని పరిస్థితి. చరణ్ కి బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ లుక్ ఎలా సాధ్యమైంది! ఎలాంటి ఆహరం తీసుకున్నాడు! ఎలాంటి నియమాలు, వ్యాయామాలు చేసాడు! అని గూగుల్ తల్లితో పాటు తమకి తెలిసిన వాళ్ళందరిని కనుక్కోవడం స్టార్ట్ చేసారు. మరి ఈ విషయంలో మీరు కష్టపడకుండానే మాకు అందిన సమాచారం ప్రకారం  పహిల్వాన్ గురించి కొన్ని విశేషాలు తెలియచేస్తున్నాం.

సాధారణంగా కండలు పెంచాలంటే మాంసాహారం తప్పనిసరి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. మోస్ట్ లీ ఆ విధంగా చేసే వాళ్ళే ఉంటారు. కానీ చరణ్ ఈ విధమైన నాన్ వెజ్ ఐటం జోలికి వెళ్ళలేదు. కనీసం ఎగ్ ని కూడా ముట్టుకోలేదు. కేవలం కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటి ప్రకృతి సిద్ధమైన ఫుడ్ తోనే  బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ లుక్ ని సొంతం చేసుకున్నాడు. అదే విధంగా గత ఎనిమిది నెలలుగా ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే కఠినమైన వ్యాయామాలతో పాటు వ్యక్తిగతట్రైనర్ పర్యవేక్షణలో మరిన్ని వ్యాయామాలు చేసాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కూడా ఆధ్యాత్మిక నియమాలని పాటిస్తూనే వ్యాయామాలు చేసాడు. వాటిల్లో 'ముగ్ధార్' అనే సాంప్రదాయ వ్యాయామ పరికరాన్ని  ఉపయోగించినట్లుగా తెలుస్తోంది.

బరువైన చెక్కతో తయారైన ముగ్ధార్' ని పాతకాలంలో యోధులు, పహిల్వాన్లు, మల్లయోధులు తమ శారీరక దారుఢ్యం, బలం, కండరాల పుష్టి కోసం చేతితో తిప్పుతూ వ్యాయామం చేసేవారు. గద  ఆకారాన్ని పోలి ఉంటుంది. టీజర్‌లో చరణ్ గదను తిప్పుతూ పోరాట సన్నివేశాల్లో కనిపించడం ఈ శిక్షణకి నిదర్శనమని కూడా చెప్పవచ్చు.


Also read: UStaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ పై అలీ కీలక వ్యాఖ్యలు 

చరణ్ ఇటీవల పెద్ది షూట్ లో గాయాలపాలవ్వడంతో పెద్ది వాయిదా అనే న్యూస్ నెటిజన్స్ అత్యధిక ఓట్లతో వాయిదా అనేది నమ్మశక్యంగానే ఉంది.  కానీ మూవీ లవర్స్, ఫ్యాన్స్ మాత్రం ఏప్రిల్ 30 న పెద్ది ఆగమనం ఫిక్స్ అంటున్నారు. మరి వాళ్ల నమ్మకం వమ్ము కాకూడదనే కోరుకుందాం. 
   
 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com