ఏం వండుతున్నారయ్యా!.. చికిరి చికిరి చరణ్
on Nov 4, 2025
.webp)
-పెద్ది ఫస్ట్ సింగల్ ఎప్పుడు!
-అభిమానుల ఆశలన్నీ పెద్ది పైనే
-ఏం వండుతున్నారు!
-చికిరి చికిరి
సిల్వర్ స్క్రీన్ వద్ద గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)కటౌట్ కి ఉన్న స్టామినా ఎంతో ప్రత్యేకం. సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రభావాన్ని చాలా బలంగా చాటగల మెగా మగధీరుడు. గత చిత్రం గేమ్ చేంజర్ తో పరాజయాన్ని అందుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ 'గేమ్ చేంజర్' పరాజయాన్ని శాశ్వతంగా మర్చిపోవాలంటే 'పెద్ది'(Peddi)తో బ్లాక్ బస్టర్ ని అందివ్వడమే చరణ్ ముందున్న ప్రధాన కర్తవ్యం. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న చరణ్ కి కూడా ఇప్పుడు విజయం చాలా అవసరం. అందుకే 'పెద్ది'ని ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తుంటేనే ఆ విషయం అర్ధమవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు బుచ్చిబాబు కూడా తమ మార్క్ ని చాలా బలంగా చాటబోతున్నారు.
రీసెంట్ గా చరణ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ 'ఎక్స్'(X)వేదికగా ఒక పిక్ ని షేర్ చేసాడు. అందులో బుచ్చిబాబు(Buchibabu),రెహ్మాన్(Ar Rehman)సింగర్ మోహిత్ చౌహన్ కలిసి ఒక సాంగ్ ట్యూన్ ని చేస్తున్నట్టుగా ఉంది. సదరు పిక్ కి 'ఏం వండుతున్నారో కాస్త చెప్పండయ్యా' అనే క్యాప్షన్ ని ఉంచాడు. సదరు ట్వీట్ కి రెహ్మాన్ బదులిస్తు 'చికిరి చికిరి అనే క్యాప్షన్ ని ఉంచాడు. ఇప్పడు ఈ రెండు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. వైరల్ గా నిలవడమే కాదు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో సరికొత్త చర్చలు కూడా జరుగుతున్నాయి. బుచ్చిబాబు కొన్ని రోజుల క్రితం అతి త్వరలోనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుందని చెప్పాడు. సోషల్ మీడియాలో సైతం ఈ నెల 6 న రిలీజ్ కాబోతుందనే టాక్ నడుస్తుంది.
Also Read: అఖండ 2 ఎంత కలెక్షన్స్ ని సాధిస్తుంది! ఫ్యాన్స్ చెప్తున్న లెక్క ఇదే
మేకర్స్ రీసెంట్ గా పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor)లుక్ ని రిలీజ్ చేసారు. అచ్చాయమ్మా' అనే క్యారక్టర్ లో సినిమాకి తగ్గట్టే జాన్వీ లుక్ ఫుల్ మాస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఏం వండుతున్నారయ్యా అని చరణ్ ట్వీట్ చెయ్యడం, రెహ్మాన్ అందుకు బదులుగా 'చికిరి చికిరి' అనడంతో సాంగ్ కి సంబంధించిన పదం అయ్యి ఉంటుందనే చర్చ అభిమానుల్లో జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఫస్ట్ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



