పాయల్ రాజ్ పుత్ తండ్రికి కాన్సర్..అయినా సరే షూటింగ్ కి జంప్
on Apr 8, 2025
ఆర్ఎక్స్100తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన పాయల్ రాజ్ పుత్(Payal Rajput)ఆ తర్వాత వచ్చిన సినిమాలతో మాత్రం ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేకపోయింది.చాలా గ్యాప్ తర్వాత 2023లో వచ్చిన 'మంగళవారం' చిత్రం మాత్రం పాయల్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రీసెంట్ గా చేసిన ఒక పోస్ట్ లో తన తండ్రి కాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనే విషయాన్ని తెలియచేసింది.
ట్రీట్ మెంట్ తీసుకుంటు హాస్పిటల్లో ఉన్నాకూడా మా నాన్న షూటింగ్ కి వెళ్లమనే ధైర్యాన్ని,ఒక భరోసాని ఇచ్చాడు.నా తండ్రి త్వరగా కోలుకోవాలని అందరు ప్రార్థించండి.షూటింగ్‌లతో నేను బిజీగా ఉన్నా కూడా నా తండ్రిని హాస్పిటల్‌లో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న నా టీంకు థాంక్స్ .హాస్పిటల్‌లో చికిత్స చేస్తున్న డాక్టర్ల బృందానికి కూడా చాలా థాంక్స్ అని చెప్తు ట్వీట్ చేసింది
పాయల్ ప్రస్తుతం తెలుగులో కిరాతక అనే మూవీలను,తమిళంలో గోల్ మాల్, ఏంజెల్ సినిమాల్లో చేస్తుంది.ఈ సంవత్సరమే ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
