పవన్ స్టైలే వేరు
on May 27, 2015
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందే ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. వపన్ కల్యాణ్ గోపాల గోపాల సినిమా తీసే సమయంలో ఆ చిత్ర దర్శకుడు డాలీతో మళ్లీ సినిమా చేద్దామని మాట ఇచ్చారట. ఇప్పుడు ఆమాట నిలబెట్టున్నాడు పవర్ స్టార్. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్ చేయబోయే సినిమాకు డాలీనే దర్శకత్వం వహించమని చెప్పాడట. దీంతో డాలీ ఈ సినిమాతోనైనా మంచి హిట్ కొట్టాలనే కసితో ఓ అద్భుతమైన కథను తయారుచేసే పనిలో వున్నాడట. దీని కోసం ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో వున్న మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ సహయం తీసుకు౦టున్నాడట. డాలీ స్క్రిప్ట్ కనుక పవన్, దాసరికి నచ్చితే వెంటనే పట్టలేక్కడ ఖాయమని అంటున్నారు. చూద్దాం డాలీ స్క్రిప్ట్ కోసం ఎంతకాలం తి౦టాడో..!!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
