
మంచిపని చేయడానికి ఎప్పుడూ వెనకాడనని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. లేటెస్ట్ గా ఆయన మరో మంచి కార్యక్రమం కోసం నడుం బిగిస్తున్నాడు. ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతగా అభివృద్ధి చెందినా, నేటికీ మనిషిని వదలని మహమ్మారి క్యాన్సర్. ఈ భయంకర వ్యాధి గురించి నిజాల కంటే, అపోహలే ప్రజల్లో ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ సోకిన వారిలో ఎక్కువ శాతం మంది, ఆ జబ్బు మీద ఉండే భయం వల్లనే చనిపోతున్నారు. ఎంత మంది డాక్టర్లు చెప్పినా, ఈ విషయం అందరికీ తెలియదు. అందుకే దీనిపై ప్రజల్ని చైతన్య పరిచేలా ప్రభుత్వం ప్రకటనల్ని రూపొందిచబోతోంది. అందులో భాగంగా, పవన్ గొంతును ప్రకటనలో వినిపించాలనుకుంటున్నారు. దీనికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అలా అయితేనే ఎక్కువమందికి చేరే అవకాశం ఉంటుందని వారి ఆలోచన. త్వరలోనే ఈ ప్రకటన థియేటర్లలోకి రాబోతోందని సమాచారం.






