పవన్ తర్వాతి సినిమా తొలిప్రేమ లాంటి ప్రేమకథ..!
on Apr 11, 2016

కష్టపడటమే నా చేతిలో ఉంది కానీ ఫలితాలు నా చేతిలో ఉండవు. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా నా పని నేను చేసుకుపోతుంటాను. ఇదీ పవన్ రెగులర్ గా చెప్పే డైలాగ్. దానికి తగ్గట్టే, సర్దార్ ఫలితంలో సంబంధం లేకుండా పవన్ తన తర్వాతి సినిమా పనుల్లో పడిపోయారు. నెక్స్ట్ ఆయన ఎస్.జే.సూర్యతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తను చాలా క్రితం వదిలేసిన లవ్ జానర్ లో సినిమా చేస్తున్నాడని సమాచారం. చివరిగా పవన్ చేసిన కంప్లీట్ లవ్ స్టోరీ తీన్ మార్. ఈ సినిమా ఫలితం కాస్త అటూ ఇటూ అయింది. దాంతో పూర్తి మాస్ సినిమాల్లో పడిపోయాడు పవన్.
నిజానికి ఖుషీ తర్వాత పవన్ ఆ రేంజ్ లవ్ స్టోరీ సినిమా చేయలేదు. అందుకే ఇప్పుడు ఎస్ జే సూర్య తో చేస్తున్న సినిమా పూర్తి లవ్ స్టోరీ ఉండాలని పవన్ సూచించాడట. ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ కు తక్కువ ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. త్రివిక్రమ్, ఎస్ జే సూర్య ల సినిమాల తర్వాత పూర్తి స్థాయిగా పాలిటిక్స్ లోకి వెళ్లిపోతానని పవన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఈ రెండు సినిమాలూ లవ్ స్టోరీలు చేసి, ఫిల్మ్ కెరీర్ కు పవన్ ఫుల్ స్టాప్ పెడుతున్నాడా అనేది అభిమానుల మదిలో ఉన్న ప్రశ్న. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా, సినిమాలకు కేవలం కామా మాత్రమే పెట్టాలనేది ఫ్యాన్స్ ఒపీనియన్. తన అన్నయ్య మెగాస్టార్ కూడా రెండు పడవల మీద ప్రయాణం చేయమని చెప్పారు. మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



