
పవనిజం అనేది ఎందుకు..? ఇప్పటికే మనకు చాలా ఇజాలు ఉన్నాయి. మళ్లీ కొత్తగా ఇజం ఎందుకు..? అసలు ఈ పవనిజం అనేది ఎప్పుడు ఎక్కడ మొదలైందో నాక్కూడా తెలియదు. కానీ నాకైతే ఇలాంటివి పెద్దగా ఇష్టం ఉండవు. కానీ అభిమానులను ఇలా ఉండద్దు, ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాక్కూడా లేదని నా అభిప్రాయం. ఇవీ పవన్ బాలీవుడ్ క్రిటిక్ అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు. మరి మీరు రాజకీయాల్లోకి వెళ్లిపోతే పవనిస్టుల సంగతేంటి..? మీకు సినిమాల పరంగానే ఫ్యాన్స్ ఎక్కువ కదా అని అడిగితే, ఏమో పవనిజం ఏమవుతుందో..వాళ్లందరూ ఏమవుతారో తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు పవన్. కేవలం మరో రెండు మూడు సినిమాల తర్వాత తన నటనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తానంటున్నాడు పవర్ స్టార్. మరి దీన్ని అభిమానులు జీర్ణించుకోగలరో లేదో చూడాలి.






