పవన్ హీరోయిన్ ఎంత మారిపోయిందో...!
on Jun 3, 2016
పవన్ కెరీర్లో మరిచిపోలేని సూపర్ హిట్ తొలిప్రేమ. ఆ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదు, అందుల్లో నటించిన కీర్తిరెడ్డి కి కూడా చాలా మెమరబుల్ ఫిల్మ్. తెలుగులో హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా, ఆమె ఇంకా తెలుగోళ్లకు గుర్తుందంటే, కారణం తొలిప్రేమ సినిమాయే. సినిమాలో ఆమె ఇంట్రడక్షన్ షాట్ అయితే తిరుగేలేదు. అయితే ఆ ఒక్క సినిమాతో మెరుపులా మెరిసిన ఈ భామ 2004 లో సుమంత్ ను పెళ్లాడి ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లయ్యాక కేవలం అర్జున్ సినిమాలో మాత్రమే కనిపించింది. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే, సుమంత్ తో ఆమె వైవాహిక జీవితం విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత యుఎస్ కు వెళ్లిపోయిన ఆమె, అక్కడ మరొకరిని పెళ్లాడి సెటిల్ అయింది. ఒక బాబు కూడా పుట్టాడు. అయితే కొన్నాళ్ల క్రితం తన కజిన్ పెళ్లికి కీర్తి హాజరవడంతో, ఆమె ఫోటో బయటికొచ్చింది. తొలిప్రేమ సమయంలో ఆమెకు ఫ్యాన్స్ అయిపోయిన వాళ్లందరూ ఇప్పుడు చూసి షాక్ అవుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ పవన్ హీరోయిన్ ఎంత మారిపోయిందో, ఫోటోలో మీరే చూడండి.