'వకీల్ సాబ్' కోసం పవన్ గానం?
on Nov 30, 2020
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి గాయకుడు కూడా. తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి.. వంటి చిత్రాల్లో బిట్ సాంగ్స్, ఫుల్ లెన్త్ సాంగ్స్ పాడి అభిమానులను అలరించారాయన. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత మరోసారి తన గానమాధుర్యంతో ఫ్యాన్స్ ని ఖుషి చేయబోతున్నారట పవర్ స్టార్.
ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ కోర్ట్ డ్రామా 'పింక్' ఆధారంగా రూపొందుతున్న 'వకీల్ సాబ్'తో పవన్ రి-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసమే తమన్ ఫస్ట్ టైమ్ పవన్ కి బాణీలు అందిస్తున్నాడు. అంతేకాదు.. పవన్ చేత ఓ ఫోక్ సాంగ్ కూడా పాడించబోతున్నారట. ఈ పాట సినిమాలో ఓ హైలైట్ గా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్. మరి.. 'వకీల్ సాబ్' కోసం పవన్ గానం అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read