Home

»

Latest News

మెగావర్స్‌లో మెగా ఫ్యామిలీ సందడి: చిరంజీవితో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ స్పెషల్ ఎపిసోడ్.!

Oct 30, 2026 3:56PM

మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న ‘మెగావర్స్’ షోపై మెగా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ షోలో చిరంజీవి తనదైన శైలిలో సందడి చేయనున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే ఎపిసోడ్‌లో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. ముగ్గురినీ ఒకే వేదికపై చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సినిమాల పరంగా ఈ ముగ్గురికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉండగా, కుటుంబ పరంగా వీరి మధ్య ఉన్న అనుబంధం కూడా అభిమానులకు ఎంతో ఇష్టం. అలాంటి ముగ్గురూ ఒకే షోలో కనిపిస్తే ఆ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణ ఉండటం ఖాయం.

ఈ ముగ్గురూ కలిసి ఒకే షోలో పాల్గొంటే, వారి వ్యక్తిగత అనుబంధాలు, సినీ ప్రయాణం, కుటుంబంలో జరిగే సరదా సంఘటనల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయనతో చిరంజీవి చేసే సంభాషణ ఎలా ఉంటుందన్న ఆసక్తి కూడా నెలకొంది.

‘మెగావర్స్’లో కమల్ హాసన్ కూడా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బ్రహ్మానందం, సునీల్, సత్యలతో ఒక ఎపిసోడ్‌ షూట్ జరిగిందనే ప్రచారం ఉంది.

చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ఈ కార్యక్రమం ద్వారా మెగాస్టార్ మరోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సంభాషణలతో ఆకట్టుకుంటారో చూడాలి.

ఇది కూడా చదవండి: ఇరుముడి దర్శకుడితో బాలయ్య.. రూటెడ్ కంటెంట్‌తో సరికొత్త ప్రయోగానికి రెడీ.!

 

 

 

[Chiranjeevi MegaVerse, Chiranjeevi Netflix Show, Mega Family Special Episode, MegaVerse Guests, Chiranjeevi, Pawan Kalyan, Ram Charan, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com