పవన్ చాలా పెద్ద ప్లాన్ తోనే ఓజి అని ఫ్యాన్స్ అరుస్తుంటే వద్దంటున్నాడా!
on Jan 6, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఎక్కడికి వెళ్లినా కూడా ఫ్యాన్స్ మొత్తం చేసే నినాదం ఒక్కటే 'ఓజి'(og).ఎందుకో తెలియదు కానీ పవన్ అప్ కమింగ్ సినిమాల లిస్ట్ లో హరిహరవీరమల్లు,ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నా కూడా అభిమానుల్లో మాత్రం 'ఓజి' కి ప్రతేకమైన క్రేజ్ ఏర్పడింది.జనరల్ గా ఏ హీరో అయినా కూడా తన సినిమా విషయంలో అభిమానులు అలా అరుస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు.కానీ పవన్ మాత్రం ఫ్యాన్స్ 'ఓజి' అని అరుస్తుంటే తను కూడా 'ఓజి' గురించి మాట్లాడటం మానేసి,గోల చెయ్యకండని చెప్తూ వస్తున్నాడు.రీసెంట్ గా రాజమండ్రిలో జరిగిన 'గేమ్ చేంజర్'ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా 'ఓజి' అని అరుస్తుంటే నా దుంప తెంపుతున్నారయ్యా అని అన్నాడే గాని మూవీ అప్డేట్ గురించి చెప్పలేదు.
'ఓజి' గురించి పవన్ మాట్లాడకపోవడానికి కారణం 'హరిహర వీరమల్లు(Hari hara veeramallu)కి క్రేజ్ తీసుకురావడానికే అనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్నాయి.ఎందుకంటే వీరమల్లు ని నిర్మాత ఏ ఏం రత్నం తో పాటు టీం మొత్తం నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.ఒక దశలో రిలీజ్ ఉంటుందా లేదా అనే డౌట్ కూడా అందరిలో వ్యక్తమవుతుంది.కానీ వీరమల్లు రెండు పార్టులుగా ఉంటుందని,పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలబడిపోబోతుందని, టీజర్ కూడా రిలీజ్ చేసాడు.కానీ ఫ్యాన్స్ మాత్రం వీరమల్లుపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడలేదు.దీంతో ఫ్యాన్స్ ఓ జి అని అరుస్తున్నప్పుడు పవన్ స్పందిస్తే వీరమల్లు కి ఏమైనా డామేజ్ కలుగుతుందేమో అని పవన్ ఆలోచిస్తున్నాడని అంటున్నారు.
వీరమల్లు ని ఎఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ(Jyothi Krishna)దర్శకత్వం వహిస్తుండగా నిధిఅగర్వాల్, బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి,పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా కీరవాణి(Keeravani)సంగీతాన్ని అందిస్తున్నాడు.మార్చి 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది
Also Read