TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఓజి అంటే మోడీ నా.. జై కొట్టాలంటే రోడ్ లు బాగుండాలి కదా 

Oct 14, 2024 4:47PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హోదాలో ప్రభుత్వానికి చెందిన పలురకాల కార్యక్రమాలు నిర్వహిస్తు చాలా బిజీగా ఉన్నాడు.రీసెంట్ గా విజయవాడకి దగ్గర్లో ఉన్న కంకిపాడు లో పలు రకాల సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన మరియు తెలుగుదేశం,బిజెపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అదే టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పవన్ ప్రసంగిస్తున్నంత సేపు పెద్దఎత్తున ఓజీ ఓజీ అని అరవడంతో పవన్  కాసేపు సినిమాల గురించి మాట్లాడాడు.మీరు ఓజీ,ఓజీ అని అరుస్తూ ఉంటే నాకు మోడీ మోడీ అని వినిపిస్తుంటుంది. మీరు మీ అభిమాన హీరో సినిమాకి వెళ్లి జై కొట్టాలంటే రోడ్ లు బాగుండటంతో పాటు చేతి నిండా డబ్బులు ఉండాలి. అందుకు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చాలా బాగుండాలి. కాబట్టి ఆర్ధిక వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఆ తర్వాత విందు వినోదాలు చేద్దాం

సినిమా ఇండస్ట్రీ లో  ఏ హీరోతో నాకు ఇబ్బంది ఉండదు.నేను ఎవరితోనూ పోటీ పడను. ఒక్కో హీరో ఒక్కో దాంట్లో నిష్ణాతులు.చిరంజీవి(chiranjeevi)బాలకృష్ణ(balakrishna)మహేష్ బాబు(mahesh babu)ఎన్టీఆర్(ntr)అల్లు అర్జున్(allu arjun)రామ్ చరణ్(ram charan)నాని(nani)ఇలా ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు. వీళ్ళందరు బాగుండాలని కోరుకునేవాడినని చెప్పుకొచ్చాడు.

 

google-ad-img