
నటన.. పలు రకాల జోనర్స్ కి సంబంధించిన సబ్జెట్స్ లో ఉండే ఎన్నో రకాల స్పర్శలు, ఆత్మీయతలు, భావోద్వేగాలు, ఉల్లాసాలు, ఆనందాలని ఒక క్యారక్టర్ లోకి దూరి అంటే మనిషి శరీరంలో కొలువు తీరి ఉండే సంజీవిని రూపం. నటిస్తుంటే శరీరంలో పవిత్రమైన సప్త నదులుప్రవహిస్తూ ఉంటాయని నటనని దైవంగా భావించే వాళ్ళు చెప్తారు. అంటే సర్వ రోగాలు మటుమాయమని. అందుకే నాటి తరం హీరోలతో పాటు మిగతా అందరూ రోజుకి మూడు సినిమాల షెడ్యూల్స్ లో పాల్గొన్నా అలసట అనేది ఎరిగే వారు కాదు. ఆలా మూడు, నాలుగు, ఐదు షిఫ్ట్స్ లో కొన్ని సంవత్సరాల పాటు చేసినా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. అదంతా విభిన్న క్యారక్టర్ లలో ప్రదర్శించే నటన వల్ల అని చాలా మంది సినీ ప్రియుల నమ్మకం. మరి ఆ నమ్మకం నిజమే అనడానికి వాళ్ళు ఇంకేం చెప్తున్నారో చూద్దాం.
కానీ ప్రస్తుతం ఒకే ఒక్క 'పాన్ ఇండియా' సినిమా కోసం రెండేళ్లు లేదా మూడేళ్ల సమయం కేటాయిస్తున్నప్పటికీ, అనేకమంది నటులు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురవ్వడం, తరచూ హెల్త్ ఇష్యూస్ బారిన పడుతున్నారు.ఆ పేర్లు చెప్పుకుంటే అభిమానులు బాధ పడతారు కాబట్టి అప్రస్తుతం. అసలు ఒకేసారి అనేక సినిమాలు చేసిన ఆనాటి నటులకు రాని ఆరోగ్య సమస్యలు, ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ డిజిటల్ యుగంలో ఎందుకు వస్తున్నాయి. గతంలో సినిమాలు తీసే విధానం, నటుల జీవన శైలి చాలా నార్మల్గా, ప్రకృతికి దగ్గరగా ఉండేవి. ఉదయం త్వరగా నిద్రలేవడం, షూటింగ్ స్పాట్లో పౌష్టికాహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటి సహజమైన అలవాట్లు ఉండేవి. యాక్షన్ సీన్లు, డ్యాన్సులు సహజ సిద్ధమైన కదలికలతో ఉండేవి కానీ, శరీరాన్ని విపరీతంగా హింసించేలా ఉండేవిరావు. కానీ నేటి పాన్ ఇండియా యుగంలో ఒక సినిమా కోసం శరీర బరువును ఉన్నపళంగా 10 నుంచి 20 కిలోలు పెంచడం, ఆ వెంటనే మళ్ళీ అంతే వేగంగా తగ్గించడం పరిపాటిగా మారింది. ఈ రకమైన క్రాష్ డైట్లు, స్టెరాయిడ్ల వినియోగం, అసాధారణమైన బాడీ ట్రాన్స్ఫార్మేషన్లు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీ.. నెట్ఫ్లిక్స్ కామెంట్స్ వైరల్!

మరో ప్రధానమైన అంశం మానసిక ఒత్తిడి. ఒకప్పుడు సినిమా విజయం లేదా ఓటమి పరిమితమైన ప్రాంతానికే పరిమితమయ్యేది. కానీ నేడు వందల కోట్ల బడ్జెట్లతో రూపొందే పాన్ ఇండియా సినిమాల వల్ల నటులపై వందల రెట్ల బిజినెస్ ప్రెజర్ ఉంటోంది. నిరంతర ప్రయాణాలు, గ్లోబల్ ప్రమోషన్లు, సోషల్ మీడియా ట్విట్టర్ ట్రోలింగ్స్ మరియు రాత్రింబవళ్లు పనిచేసే డిజిటల్ షూటింగ్ లైటింగ్ సిస్టమ్స్ వల్ల కంటి నిండా నిద్ర కరువవుతోంది. మెదడుకు, శరీరానికి తగినంత విశ్రాంతి దొరకకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, బిపి, గుండె జబ్బులు మరియు ఇమ్యూనిటీ తగ్గడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. అదే సినీ కళామతల్లి, నటన నా తల్లి అని రోజు సెట్స్ లో ఉండేలా చేసుకుంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, టైం ప్రకారం ఫుడ్, అంతకంటే ముందు సంజీవినిని తలపించేలా మన శరీరంలో ప్రవహిస్తూ ఉండే నటన.. అనేక హెల్త్ ఇష్యుస్ ని ఆమడ దూరంలో ఉంచుతుందని కళా రంగ ప్రియులు చెప్తున్నారు.
[Pan India Actors Health Lifestyle Changed, pan india actors health, classic indian actors lifestyle, movie shooting stress, actor body transformation, Tollywood actors health, cinema industry lifestyle changes, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]




