ఆది 'పార్టనర్' హన్సిక కాదు
on Mar 22, 2019
ఆది పినిశెట్టి, హన్సిక ఓ తమిళ సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'పార్టనర్' టైటిల్ ఖరారు చేశారు. అయితే... ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఆది 'పార్టనర్'గా హన్సిక నటించడం లేదు. అదేనండీ... ఆది పక్కన హీరోయిన్ గా హన్సిక నటించడం లేదు. తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన 'అబ్బాయితో అమ్మాయి'తో హీరోయిన్ గా పరిచయమైన పల్లక్ లల్వానీ నటిస్తుంది. తెలుగులో 'జువ్వ', 'క్రేజీ క్రేజీ ఫీలింగ్' వంటి సినిమాల్లో ఆమె నటించింది. అయితే... పెద్ద గుర్తింపు ఏమీ రాలేదు. ఇప్పుడు తమిళంలో ఆది పక్కన నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో బ్రేక్ వస్తుందేమో చూడాలి. ఈ సినిమాతో నయనతార 'డోరా'కు కో డైరెక్టర్ గా పని చేసిన మనోజ్ దామోదరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.