Home

»

Latest News

‘ఒసేయ్ రాములమ్మ’ రీమిక్స్‌.. థియేటర్లను షేక్ చేయబోతున్న రష్మిక.!

Nov 20, 2026 2:44PM

రష్మిక మందన్న కెరీర్‌లోనే భిన్నమైన సినిమాగా ‘మైసా’ రూపొందుతోంది. ఇప్పటివరకు గ్లామర్‌, లవ్‌ స్టోరీలతో ప్రేక్షకులను అలరించిన ఈ నేషనల్‌ క్రష్‌.. ఈ సినిమాలో మాత్రం యాక్షన్‌ అవతార్‌లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అందులో ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను రీమిక్స్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.

1997లో విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయశాంతి నటన, సినిమాలోని తిరుగుబాటు నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ టైటిల్‌ సాంగ్‌ ఇప్పటికీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 

ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ పాటను ‘మైసా’ కోసం రీమిక్స్‌ చేశారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ఈ రీమిక్స్‌ నిజమైతే మాత్రం థియేటర్లలో మంచి బాంగర్‌గా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

‘మైసా’లో రష్మిక ఒక అణచివేతకు గురైన గిరిజన తెగ కోసం పోరాడే మహిళగా కనిపించనున్నట్లు ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆమెను మునుపెన్నడూ చూడని పవర్ ఫుల్ యాక్షన్‌ అవతార్‌లో చూపించారు. అండర్‌వాటర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ కూడా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం.

ఇది కూడా చదవండి: ఏనాటి వరమో నువ్వు.. తండ్రీకూతుళ్ల అనుబంధంతో మైసా రెండో పాట.!

ఈ నేపథ్యంలో ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను రీమిక్స్‌ చేయడం కథకు కూడా బాగా సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒరిజినల్‌ పాటలోని తిరుగుబాటు స్ఫూర్తిని రష్మిక పాత్రకు అనుగుణంగా ఎలా మార్చారనేది ఆసక్తికరంగా మారింది. జేక్స్‌ బిజోయ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

రావీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. మరి విజయశాంతి ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను రష్మిక తన స్టైల్‌లో ఎలా రీక్రియేట్‌ చేస్తారు? ఈ రీమిక్స్‌ నిజంగా థియేటర్లలో మాస్‌ బాంగర్‌గా నిలుస్తుందా? అనేది చూడాలి.

మీకు కూడా నచ్చవచ్చు:
చలో పదవే.. చిన్నారి ప్రపంచంలోకి తీసుకెళ్లిన వృషకర్మ సాంగ్‌.!
ప్రమోషన్స్‌ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్‌ రావిపూడిపై కీర్తి, కృతి సెటైర్లు.!

 

 

 

[Osey Ramulamma Remix, Rashmika Mandanna, Mysaa Movie, Vijayashanti]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com