ప్రముఖ హీరోయిన్ కి పార్సెల్ లో మాంసం.. ఏ రకమో తెలిస్తే షాక్ అవుతారు
on Sep 24, 2025

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),పా రంజిత్(Pa Ranjith)కాంబోలో వచ్చిన 'కాలా'తో పాటు పలు భాషలకి చెందిన సినిమాల్లో చెయ్యడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన నటి 'సాక్షి అగర్వాల్'(Sakshi Agarwal). ఉత్తరాదికి చెందిన సాక్షి రీసెంట్ గా ప్రముఖ డెలివరీ యాప్ నుంచి 'పన్నీర్ కర్రీ' ని ఆర్డర్ చేసింది. కానీ అందులో పన్నీర్ కర్రీ తో పాటు 'చికెన్ ముక్కలు' కూడా ఉన్నాయి.
ఈ మొత్తం విషయంపై సాక్షి ఇనిస్టాగ్రమ్ వేదికగా పోస్ట్ చేస్తు 'నేను పుట్టినప్పటి నుంచి పూర్తి శాకాహారిని. స్విగ్గీ లో ఆర్డర్ చేసిన పన్నీర్ కర్రీ రావడంతో తినడం ప్రారంభించాను. పన్నీర్ తో పాటు చికెన్ ముక్కలు ఉండటంతో షాకయ్యాను. జీవితంలో ఎప్పుడూ మాంసాహారం ముట్టని తనకు ఇలాంటి అనుభవం ఎదురవ్వడం దారుణం. ఈ సంఘటనతో శాకాహారినైన తనతో బలవంతంగా మాంసాహారం తినిపించినట్లయింది. ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, ఒక శాకాహారికి చికెన్ పంపడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అని సదరు రెస్టారెంట్‌పై సాక్షి తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్షి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఫుడ్ డెలివరీ సంస్థలు, రెస్టారెంట్లు సున్నితమైన విషయాల్లో చాలా బాధ్యతగా వ్యవహరించాలని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాక్షి అగర్వాల్ తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు రాజు రాణి, విశ్వాసం, టెడ్డి, సిండ్రెల్లా, బఘిరా,రింగ్ రింగ్ , ఫైర్, ది కేస్ డైరీ ఇలా వివిధ భాషల్లో ఇప్పటి వరకు సుమారు ఇరవై ఇది చిత్రాల వరకు చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



