ఓం నమో వెంకటేశాయ టైటిల్‌పై వివాదం
on Jan 21, 2017

దర్శకేంద్రుడు కె.రాఘవంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమా ఆడియో రిలీజ్ జరుపుకుని విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌పై వివాదం నెలకొంది. సినిమా టైటిల్‌ను మార్చాలంటూ కొందరు ఆందోళనకు దిగారు. అన్నమయ్య, రామదాసు భక్తుల పేర్లు టైటిల్‌గా పెట్టిన రాఘవేంద్రరావు హథీరాంబాబాజీగా మార్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తిరుపతిలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇంతకు ముందే హైదరాబాద్‌లోనూ పలు సంఘాల నేతలు ఇప్పటికే డిమాండ్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



