.webp)
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి వరల్డ్ వైడ్ గా 'ఓం' తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టేసారు. దీంతో పాన్ ఇండియా ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టారు. ప్రెజెంట్ బొమ్మ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు రివ్యూ వచ్చే లోపు ట్విట్టర్ రివ్యూ నాకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వు అంటుంది. మరి అదేంటో చూసేద్దాం.
'ఓం' కథ ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జరిగే ఎర్రచందనం, గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది. ఈ కథలో సుమారు 1000 టన్నుల విలువైన గంధపు చెక్కల అక్రమ రవాణాకు ప్లాన్ చేయగా, అందులో కేవలం 300 టన్నుల సరుకు మాత్రమే చేరుతుందని, మిగిలిన 700 టన్నుల సరుకు మాయమవ్వడం వల్ల రెండు మాఫియా గ్రూపుల మధ్య పెద్ద యుద్ధమే మొదలవుతుందని కథాంశంగా నిలుస్తోంది.
అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ అధినేత బర్మా కార్తికేయన్ అలియాస్ సియా క్యారక్టర్ లో మమ్ముట్టి కనిపించగా, అతని కుడిభుజంగా చెజియన్ అలియాస్ తిరు కుమరన్ గా ధనుష్ నటించారు. అనూహ్య పరిస్థితుల్లో తన బాస్‌కే ధనుష్ పాత్ర ఎదురు తిరగడం కథలో కీలక మలుపుగా నిలుస్తోంది. ఈ హై-ప్రొఫైల్ స్మగ్లింగ్ కేసును ఛేదించడానికి, మాఫియా ఆట కట్టించడానికి చేపట్టిన 'ఆపరేషన్ మోల్'కు ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డిగా సాయి పల్లవి నాయకత్వం వహిస్తున్నారు.
.webp)
పోలీసులను తక్కువ అంచనా వేసే మాఫియాపై ఆమె ఉక్కుపాదం మోపే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరోవైపు ధనుష్ భార్య రోజా పాత్రలో శ్రీలీల భావోద్వేగభరిత పాత్రలో కనిపించగా, రేణు దేశాయ్ కూడా కీలక పాత్రలో మెరిశారు. ట్విట్టర్ రివ్యూలలో ప్రేక్షకులు ప్రధానంగా ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార: ఆడపిల్లల కలలకి రెక్కలు తొడిగే అద్భుత సందేశం!
ధనుష్ తన సహజసిద్ధమైన నటనతో, మమ్ముట్టి తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాకు భారీ బలాన్ని ఇచ్చారని పలువురు యూజర్లు రాశారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో హై మూమెంట్స్ ఇస్తున్నాయని, ఇంటర్వెల్ బ్లాక్ ఊహించని ఎమోషనల్ ట్విస్ట్‌తో ఆకట్టుకుంటోందని ట్వీట్లలో ప్రస్తావించారు. సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన తీరుకు ప్రత్యేకంగా మెచ్చుకోలు లభిస్తోంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'నెక్స్ట్ లెవల్'లో ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, కథలో లీనమైన తర్వాత మంచి ఫీల్ ఇస్తోందని ప్రేక్షకుల అభిప్రాయంగా ఉంది. మొత్తంగా మాస్ యాక్షన్, స్మగ్లింగ్ థ్రిల్లర్, కుటుంబ భావోద్వేగాల కలయికతో వచ్చిన 'ఓం' సినిమా తొలి షో నుంచే ఆడియన్స్‌లో మంచి బజ్‌ని సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ అయితే మేం ఊహించిన దాని కంటే ఎక్కువగా నచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.






