ఆశ్చర్యానికి లోను చేస్తున్న సూపర్ స్టార్ లుక్!
on Dec 15, 2017
ఏ రాష్ట్రంలో అయినా.. నంబర్ వన్ హీరో ఒకరే ఉంటారు. తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్, కన్నడ విష్ణువర్దన్.. ఇలా అనమాట. కానీ కేరళలో మాత్రం అందుకు విరుద్దం. అక్కడ ఇద్దరు సూపర్ స్టార్లు. వారే మమ్ముట్టి, మోహన్ లాల్. వీరిలో ఎవరు నంబర్ వన్? అంటే దానికి సమాధానం లేదు. అక్కడ ఎవరు సినిమా రిలీజైతే వారే నంబర్ వన్. అదనమాట లెక్క. ప్రస్తుతం కేరళలో మోహన్ లాల్ టైమ్ నడుస్తోంది. రీసెంట్ గా ‘పులి మురుగన్’తో భారీ విజయాన్ని అందుకున్నారు లాల్. కేరళలో విజయవంతమైన సినిమా 30 కోట్లు వసూలు చేస్తే అదే గొప్ప. కానీ..‘పులి మురుగన్’ ఏకంగా వంద కోట్లు వసూలు చేసి మలయాళ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. అంతేనా... ఇతర బాషల్లో కూడా విజయ దుందుభి మోగించింది. అదే ఊపులో మోహన్ లాల్ చేసిన మరో చిత్రం ‘ఒడియన్’. 57 ఏళ్ల లాల్.. ఇందులో 26 ఏళ్ల యువకునిగా నటిస్తుండటం విశేషం. అందుకోసం దాదాపు 20 కేజీల బరువు తగ్గారు మోహన్ లాల్.
ఆ వయసులో బరువు తగ్గడం సామాన్యమైన విషయం కాదు. సుశిక్షుతులైన ట్రైనర్స్ పర్యవేక్షణలో కఠోరమైన డైట్ చేసి.. మోహన్ లాల్ తగ్గారు. ఇటీవలే ’ఒడియన్’ టీజర్ విడుదల చేశారు. టీజర్ లో మోహన్ లాల్ ని చూసినవారందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారంటే నమ్మండి! ఇందులో ‘ఒడియన్ మానిక్కన్’ అనే పాత్రలో లాల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. వి.ఎ. శ్రీకుమార్ దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్న ‘మహాభారతం’ లో భీమునిగా నటించనున్నారు మోహన్ లాల్. ఆ సినిమా కూడా వి.ఎ.శ్రీకుమారే దర్శకుడు కావడం విశేషం. కేరళ ప్రేక్షకులందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న ’ ఒడియన్’ టీజర్ మీ కోసం.
Also Read