NTRNeel: ఎన్టీఆర్ 'డ్రాగన్' రిలీజ్ డేట్.. చరణ్ 'పెద్ది'కి పోటీగా పెద్ద స్కెచ్!
on Apr 9, 2025
ఆగస్టు 14న బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించనున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ కి 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మొదట ఎన్టీఆర్ లేని కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. కొత్త షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేశారు.
'డ్రాగన్'ని మొదట 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ కాస్త ఆలస్యంగా మొదలు కావడంతో.. సినిమా వేసవికి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అంటే డ్రాగన్ విడుదలకు సరిగ్గా ఏడాది సమయముంది.
ఇదిలా ఉంటే, డ్రాగన్ విడుదలకు రెండు వారాల ముందు తేదీలపై ఇప్పటికే రెండు సినిమాలు కర్చీఫ్ వేశాయి. మార్చి 26న 'ది పారడైజ్' తో నాని, మార్చి 27న 'పెద్ది'తో రామ్ చరణ్ రానున్నారు. పెద్ది నిర్మాణంలో మైత్రి కూడా భాగస్వామి. అలాంటిది మైత్రి నుంచి కొద్ది రోజుల వ్యవధిలో రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి, ఈలోపు ఏదైనా సినిమా విడుదల తేదీ మారుతుందేమో చూడాలి. అయినా మైత్రికి ఇది కొత్త కాదు. గతంలో బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలను ఒకేసారి విడుదల చేసింది. చూద్దాం మరి 'పెద్ది', 'డ్రాగన్' సినిమాల విషయంలో ఏం జరుగుతుందో.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
