ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు..అందుకే పార్ట్ 2 చెయ్యటం లేదు
on Apr 5, 2025
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కెరీర్ లో ఉన్న ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ లో 'అదుర్స్'(Adhurs)కూడా ఒకటి.అయితే మిగతా సినిమాల హిట్ కి 'అదుర్స్' హిట్ కి ఎంతో ప్రత్యేకత ఉంది.చారి,నరసింహ అనే రెండు వైవిధ్యంతో కూడుకున్న క్యారక్టర్ లలో అవలీలగా నటించి టైటిల్ కి తగ్గట్టే అదుర్స్ అనిపించాడు.ముఖ్యంగా చారి క్యారక్టర్ ద్వారా తనలో ఉన్నకామెడీ యాంగిల్ ని ప్రేక్షకులకి పరిచయం చేసి కామెడీ ని పండించడంలో కూడా తిరుగులేదని నిరూపించాడు.చారిగా ఎన్టీఆర్ పలికించిన డైలాగ్ మాడ్యులేషన్ కోసం నేటికీ అదుర్స్ ని యూట్యూబ్ లో చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 'మాడ్ స్క్వేర్'(Mad Square)మూవీ సక్సెస్ మీట్ నిన్న హైదరాబాద్(Hyderabad)లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరయ్యాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నవ్వించడం చాలా గొప్ప వరం.ఎవరైనా ఒకరొచ్చి మనల్ని నవ్విస్తే బాగుండు కదా మన కష్టాలు,బాధల్ని నుంచి బయటపడతాం అని అనిపిస్తుంటుంది.కాకపోతే అలాంటి మనుషులు మనకి అరుదుగా దొరుకుతారు.అలా అరుదుగా దొరికిన వ్యక్తి కళ్యాణ్ శంకర్.ఏ నటుడికైనా కామెడి ని పలికించడం చాలా కష్టమైన పని.అందుకే నేను అదుర్స్ 2 చెయ్యడం లేదు.ఇప్పుడు అంతగా కామెడి ని పండించగలనా లేదా అని భయపడుతున్నాను.
కాకపోతే దేవర పార్ట్ 2 మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.దాని కంటే ముందు ప్రశాంత్ నీల్(Prashant Neel)సినిమా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ ఫస్ట్ టైం వార్ 2 తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండటంతో ఆ మూవీపై అభిమానులతో పాటు భారీ అంచనాలు ఉన్నాయి.అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న వార్ 2(War 2)లో హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
