Home

»

Latest News

Ntr: విరాళాల పేరుతో మోసపోకండి.. అక్రమ వసూళ్లపై ఎన్టీఆర్ టీమ్ సీరియస్ వార్నింగ్

May 14, 2026 10:50AM


మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ( NTR) కి  ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన కట్ అవుట్. అభిమాన గణం కూడా ఎక్కువ. పైగా సదరు అభిమాన సంఘాలు నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే  కొంతమంది కేటుగాళ్లు ఎన్టీఆర్ పేరుతో అనధికారికంగా విరాళాలు సేకరిస్తూ సామాన్యులని ,అభిమానులని  మోసం చేస్తున్నారు. దీంతో 'ఎన్టీఆర్ ఆఫీస్' (NTR Office) స్పందిస్తూ ఒక కీలక అధికారిక ప్రకటనని విడుదల చేసింది.


గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలనో, లేక సేవా కార్యక్రమాల పేరుతోనో కొంతమంది వ్యక్తులు క్యూఆర్ కోడ్‌లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులు,ట్విట్టర్ వేదికగా ఈ తరహా ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. ఇవి పూర్తిగా అనధికారికమని మరియు వీటికి ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఎన్టీఆర్ పేరు మీద ఎలాంటి విరాళాలు సేకరించాలన్నా, కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఎన్టీఆర్ ఆఫీస్ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి.

ఎవరైనా వ్యక్తిగతంగా గానీ, సంస్థల పేరుతో గానీ విరాళాలు అడిగితే స్పందించవద్దు. అలాంటి వారిని ప్రోత్సహించవద్దు. ఎన్టీఆర్ పేరుని దుర్వినియోగం చేస్తూ డబ్బులు వసూలు చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Also read: VeeraBhadrudu: వీరభద్రుడు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. మార్నింగ్ షో క్యాన్సిల్  

ఎన్టీఆర్ ఆఫీస్ తీసుకున్న ఈ నిర్ణయం అటు అభిమానులను, ఇటు సామాన్య ప్రజలను మోసగాళ్ల భారీ నుండి కాపాడేందుకు ఎంతో దోహదపడుతుంది. సెలబ్రిటీల పేరుతో జరిగే ఇలాంటి స్కామ్‌ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడితే వెంటనే పోలీసులకు లేదా ఎన్టీఆర్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సమాచారం అందించడం ఉత్తమం. 

 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com