ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ.. బిగ్ అప్డేట్..!
on Feb 1, 2025
ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు షూటింగ్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. (NTR Neel)
ఎన్టీఆర్-నీల్ మూవీ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో షూటింగ్ మొదలు కానుందట. 'వార్-2'లో ఎన్టీఆర్ భాగం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 'వార్-2'ని త్వరగా పూర్తి చేసి, ఎన్టీఆర్ ఇక తన పూర్తి ఫోకస్ ని ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై పెట్టనున్నాడట.
ఎన్టీఆర్-నీల్ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
