.webp)
ప్రెజెంట్ ఎన్టీఆర్ అభిమానులు, సినీ అభిమానుల మైండ్ సెట్ లో ఏముందో చెప్పమంటారా! ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ కంప్లీట్ అయ్యి తమ ముందుకొస్తుందా అని.. తమ ఇష్టదైవాల్ని కూడా ప్రార్థిస్తుంటారు. టీజర్ రాజేసిన ప్రేమ చిచ్చే అదంతా. అలాంటి డ్రాగన్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసేలా చేస్తుంది.
డ్రాగన్ కి కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే,రవి బస్రూర్‌తో పాటు 'ధురంధర్' సంగీత దర్శకుడు శశ్వత్ సచ్‌దేవ్ డ్రాగన్ లోని కొన్ని ప్రత్యేకమైన పాటల కోసం భాగం కానున్నారనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ డెప్త్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'డ్రాగన్' చిత్రంలో విజువల్స్ పరంగానే కాకుండా ఆడియో పరంగా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రవి బస్రూర్ తనదైన శైలిలో నేల విడిచి సాము చేయని సరికొత్త, ఎపిక్ అండ్ రూటెడ్ మ్యూజికల్ టెక్చర్స్‌ను అందిస్తుండగా, శశ్వత్ సచ్‌దేవ్ రాకతో ఈ ఆల్బమ్‌కు మరింత గ్లోబల్ అప్పీల్ రానుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మల్టీ-లాంగ్వేజ్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా కొన్ని ప్రత్యేకమైన ట్రాక్స్‌ను శశ్వత్ కంపోజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: ఎందుకు ఇలా జరిగింది.. ఫ్యాన్స్ షాక్!

ఒకే చిత్రానికి ఇద్దరు డిఫరెంట్ జోనర్‌ల మ్యూజిక్ కంపోజర్లు పనిచేయడం అనేది టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగానికి తెరలేపుతోంది. అయితే శశ్వత్ పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ క్రేజీ అప్‌డేట్ ఎన్టీఆర్ అభిమానుల్లో విపరీతమైన జోష్ నింపుతోంది.
[Ntr Dragon Two Music Directors, Shashwat Sachdev in Dragon, NTR Dragon, Prashanth Neel, Ravi Basrur, Shashwat Sachdev, Dragon movie update,Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]





