నిత్యామీనన్ ఆ హీరోకి అభిమాని అంట!
on Jul 2, 2016

అప్పట్లో "నాకు ప్రభాస్ ఎవరో తెలియదు" అని మీడియావారికి సమాధానమిచ్చి టాలీవుడ్ లో సంచలనం రేపిన నిత్యామీనన్ కనీసం ఆ విషయమై మళ్ళీ ఎక్కడా స్పందించలేదు. ప్రభాస్ కూడా ఆ విషయాన్ని కూల్ గా తీసుకొన్నాడు. ఆ తర్వాత నిత్యామీనెన్ ఒక హీరో గురించి మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు, వినలేదు కూడానూ. అలాంటి నిత్య మన జూనియర్ ఎన్టీయార్ పై ప్రశంసల వర్షం కురిపించేస్తోంది.
ఎన్టీయార్ తో కలిసి "జనతా గ్యారేజ్" సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది నిత్యామీనన్. ఆ సమయంలో ఎన్టీయార్ డైలాగ్ డెలివరీని, పేజీలు పేజీలు డైలాగ్స్ ను సింగిల్ టేక్ లో ఓకే చేయడం వంటి సందర్భాలను స్వయంగా చూసిన నిత్య అతడి టాలెంట్ కు ఫిడా అయిపోయిందట. అలాగే తాను టేక్స్ తీసుకొంటున్నప్పుడు కూడా ఎన్టీయార్ అదే షాట్ లో చాలా ఓపిగ్గా నిల్చోనేవాడట. ఇలా చాలా విషయాల్లో ఎన్టీయార్ తెగ నచ్చేశాడట నిత్యకు. అందుకే "నేనిప్పుడు అతడి అభిమాని అయిపోయాను" అంటోంది అమ్మడు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



