నితిన్ కు పవన్ ఫోన్ నుంచి కాల్..!
on May 28, 2016
.jpg)
నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా అ..ఆ. వచ్చేవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకోసం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టారు మూవీ టీం. వరస ఇంటర్వ్యూలతో హల్ చల్ చేస్తున్నారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా షూటింగ్ టైం లో జరిగిన ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని చెప్పాడు నితిన్. పవన్ కళ్యాణ్ కు నితిన్ హార్డ్ కోర్ ఫ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే సరదాగా తనను ఆటపట్టించడానికి దర్శకుడు త్రివిక్రమ్ చిన్న చిలిపి పని చేశాడు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న సమయంలో ఆయన ఫోన్ నుంచి నితిన్ కు కాల్ చేశాడు. సాక్షాత్తూ పవన్ నుంచే కాల్ రావడంతో ఒక్కసారిగా నితిన్ కు గుండె ఆగినంత పనైందట. కాసేపు ఏమీ అర్ధం కాలేదట. ఫోన్ లిఫ్ట్ చేసి హల్ అనగానే, అటుపక్కన త్రివిక్రమ్ వాయిన్ వినిపించిందట. అప్పుడు గానీ నితిన్ కు డైరెక్టర్ ప్లాన్ చేసిన సంగతి అర్ధం కాలేదు. అ..ఆ షూటింగ్ టైంలో ఇలాంటి చాలా సరదా సంఘటనలు జరిగాయని, అంతేకాకుండా తాను ఎప్పటికప్పుడు పవన్ గురించి త్రివిక్రమ్ ను అడిగి తెలుసుకుంటుండేవాడినని చెబుతున్నాడు నితిన్. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ అ..ఆ మీదే ఉన్నాయి. సమంత కూడా బ్రహ్మోత్సవం లాంటి ఫ్లాప్ తర్వాత, ఈ సినిమా మళ్లీ హిట్ జోన్ లోకి తీసుకెళ్తుందని నమ్మకంగా ఉంది. మరి త్రివిక్రమ్ ఏం చేశాడో తెలియాలంటే, జూన్ 2 వరకూ ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



