అ..ఆ ను అమెరికాలో అలా చేశారట..!
on Jun 3, 2016
త్రివిక్రమ్ సినిమా అంటే మామూలుగానే జనానికి ఆసక్తి ఉంటుంది. హీరోతో సంబంధం లేకుండా, ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఐతే చాలు హాళ్లకు వెళ్లే జనాలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులకు త్రివిక్రమ్ సినిమాలంటే హాట్ కేకులే. ఇదే అ..ఆ కు కూడా రిపీట్ అవుతోంది. వీకెండ్ పూర్తయ్యే సమయానికి సినిమా మిలియన్ డాలర్ల మార్కును దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. జస్ట్ ప్రీమియర్ షోలతోనే రికార్డ్స్ నమోదు చేసింది అ ఆ. అయితే అక్కడి వెర్షన్ లో ఒక నాలుగైదు నిముషాల ల్యాగ్ ను తీసేయించాడట త్రివిక్రమ్. తక్కువ లెంగ్త్ ఉండే హాలీవుడ్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన అక్కడి మనోళ్లకు, సినిమా డ్యూరేషన్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని మాటల మాంత్రికుడి అభిప్రాయం. చూస్తుంటే ఈ టెక్నిక్ వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది. మన దగ్గర కంటే, అక్కడ మరింత జోరుగా ఉన్నాయి కలెక్షన్లు. ఓవర్సీస్ లో ఫస్ట్ డే కలెక్షన్లు నితిన్ కెరీర్లోనే బెస్ట్ కావడం విశేషం. సినిమా రిజల్ట్ తో అ ఆ టీం పండగ చేసుకుంటున్నారు.