నితిన్ నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ ఆయనే!
on Jun 27, 2016

"అ ఆ"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొని అగ్ర కథానాయకుల జాబితాలో స్థానం కోసం అర్జీ పెట్టుకొన్న నితిన్.. తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి పనులు అప్పూడే మొదలెట్టేశాడు. సీనియర్ ప్రొడ్యూసర్ మరియు ఇటీవలే రవితేజతో "బెంగాల్ టైగర్" లాంటి ట్రెండీ హిట్ అందుకొన్న రాధామోహన్ నిర్మాణంలో నితిన్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అధికారవర్గాల సమాచారం. దర్శకుడు ఎవరనేది ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనప్పటికీ.. "నేను శైలజ" ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికిడ్ అర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ కు వెళుతుంది, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. "అ ఆ" హిట్ తో సూపర్ హిట్ కొట్టిన నితిన్ రేంజ్ ఇప్పుడు పెరిగింది కాబట్టి.. తమిళ లేదా మలయాళ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ ను ఈ సినిమా నటింపజేయాలను చూస్తున్నారట. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



