ENGLISH | TELUGU  

"నువ్వు గుచ్చితే.. నేను చీరేస్తా".. 'భీష్మ' ట్రైలర్ రివ్యూ

on Feb 17, 2020

 

"బలవంతుడితో పోరాడి గెలవొచ్చు.. అదృష్టవంతుడితో గెలవలేం".. హీరోను ఉద్దేశించి విలన్ చెప్తున్న మాటలివి. ఇందులో హీరో నితిన్.. విలన్ జిషుసేన్ గుప్తా. 'భీష్మ' మూవీ ట్రైలర్‌లో ఈ డైలాగ్స్ మనకు వినిపిస్తాయి. ఇందులో నితిన్ పేరు భీష్మ. మహాభారతంలో భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి. దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని లాంటి ఎన్నో పేర్లు ఉండగా ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారనీ, దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదని అమ్మ దగ్గర వాపోతూ ట్రైలర్‌లో కనిపిస్తున్నాడు భీష్మ. ఈ మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం రిలీజయ్యింది. 

భీష్మ తండ్రి సేంద్రియ వ్యవసాయానికి మారిపోదామని ఆశించే వ్యక్తి. అందుకు విరుద్దంగా అనైతిక పద్ధతుల్లో 60 రోజుల్లో పండే పంటను 40 రోజుల్లోనే పండించాలని విలన్ చెప్తుంటాడు. సహజంగానే అతడిని భీష్మ ఢీకొంటాడు. తొమ్మిది నెలలలకు పుట్టాల్సినవాడు ఆరు నెలల్లోనే పుడితే, అతడిని నెలతక్కువ వెధవా! అంటారని విలన్‌తో చెప్తున్నాడు భీష్మ. అతడి పేరుమీదే పెట్టిన 'భీష్మ ఆర్గానిక్స్'లో ఎంప్లాయ్ అయిన చైత్రతో మనవాడు ప్రేమలో పడతాడు. ఆమె కూడా పడినట్లే కనిపించింది. అంతలోనే ఏమైందో ఏమో, "నన్ను నీ నుండి ఎలా కాపాడుకున్నానో, ఈ కంపెనీని కూడా అలాగే కాపాడతా" అని భీష్మతోనే సవాలు చేసినట్లు చెప్తోంది చైత్ర. ఆమె అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది ఆసక్తికరం.

"వాడు కొట్టినా చూడొచ్చు సార్.. కొటేషన్ చెప్తుంటే వినలేం" అని రఘుబాబుతో వెన్నెల కిశోర్ చెప్పగానే, "యు టచ్ మి, ఐ పోక్ యు.. యు పోక్ మి, ఐ స్క్రాచ్ యు" (నువ్వు టచ్ చేస్తే, నేను గుచ్చుతా.. నువ్వు గుచ్చితే, నేను చీరేస్తా) అని కొటేషన్ ఇచ్చాడు భీష్మ. దాన్ని బట్టి భీష్మ క్యారెక్టరైజేషన్ ఏమిటనేది ఒక అవగాహనకు రావొచ్చు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారైన ఈ మూవీలో యాక్షన్ కూడా తగుపాళ్లలో ఉన్నట్లు నితిన్ చేసే ఫైట్లు చూస్తే అర్థమవుతోంది. అలాగే ఆర్గానిక్ వ్యవసాయం గురించి కూడా మంచి విషయాలు చెప్పినట్లు మనం ఈజీగా ఊహించవచ్చు. 

ఇటీవలే 'అశ్వత్థామ'లో విలన్‌గా ఆకట్టుకున్న జిషుసేన్ గుప్తా.. ఈ మూవీలో మరోసారి మనల్ని ఆకట్టుకోబోతున్నాడు. నితిన్ తండ్రిగా కన్నడ సీనియర్ యాక్టర్ అనంత నాగ్ నటించారు. నితిన్, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవలేని ఈ మూవీని 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల రూపొందించాడు. ట్రైలర్‌తో ఆసక్తి రేపుతున్న 'భీష్మ' ఫిబ్రవరి 21న మన ముందుకు వస్తున్నాడు. తెరపై అతను ఎలా ఉంటాడో చూడాలి మరి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.