తెలుగులో నీరజ కోన చక్కగా రాశారోయ్!
on Jun 15, 2019

ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోనలో రైటర్ కూడా ఉన్నారు. కజిన్ కోన వెంకట్ అంత కాకున్నా ఆమెలో ఒక పార్ట్ టైమ్ లిరిక్ రైటర్ ఉన్నారు. సాయిధరమ్ తేజ్ 'తిక్క'లో ధనుష్ పాడిన 'తిక్క తిక్క' సాంగ్ రాసినది ఆవిడే. తమన్ మ్యూజిక్ అందించిన ఆ సాంగులోఇంగ్లిష్ పదాలు ఎక్కువగా ఉంటాయి. సినిమాకు తగ్గట్టు, దర్శకుడి సూచనల మేరకు అలా రాసి ఉండొచ్చు. ఈసారి మాత్రం చక్కటి తెలుగులో, ఒక్క ఇంగ్లిష్ పదం లేకుండా నీరజ కోన రాశారు. మళ్ళీ ఆమె చేత పాట రాయించినది తమనే. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. ఇటీవల సినిమా టైటిల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను రాసినది నీరజ కోన. ఒక్కసారి పాట వినండి... మంచి మెలోడీ. అలాగే, పాటలో ఒక్కటంటే ఒక్క ఇంగ్లిష్ పదం కూడా వినపడదు. అలాగని, ప్రేక్షకులకు అర్థం కాని క్లిష్టమైన పదాలు కూడా ఏమీ లేవు. అందరికీ అర్ధమయ్యే పదాలతో చక్కగా పాటను రాశారు నీరజ కోన. ఈ పాట తరవాత మరింతమంది పాటలు రాయమని ఆమెను సంప్రదించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



