రుక్మిణితో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటున్న హీరో నిఖిల్
on Oct 6, 2024
కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. స్వామి రారా, కేశవ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావటం విశేషం.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి తమ 32 వ చిత్రంగా దీన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. టైటిల్ లోగోలో కారుకు సంబంధించిన భాగాలను గమనించవచ్చు. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే హీరో నిఖిల్, హీరోయిన్ రుక్మిణి వసంత్ నడుస్తూ వస్తున్నారు.
కన్నడ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులర్ హీరోయిన్‌గా అందరినీ అలరిస్తోన్న రుక్మిణి వసంత్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మరో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తోంది. హర్ష చెముడు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని..సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.