డేటింగ్ చెయ్యకూడదని అగ్రిమెంట్ చేయించుకున్నారు..నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు
on Mar 22, 2025
నిధి అగర్వాల్(Nidhhi Agerwal)ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan,)ప్రభాస్(Prabhas)అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ హరిహరవీరమల్లు(Hariharaveeramallu)ది రాజాసాబ్(The Raja saab)లో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ రెండు చిత్రాల షూటింగ్ లలో ఒకేసారి పాల్గొంటు పరిశ్రమ దృష్టిని ఆకర్షించడమే కాకుండా,వైవిధ్యమైన పాత్రలని పోషిస్తు తన సత్తా చాటడానికి సిద్దమవుతుంది.దీంతో ఈ సారి నిధి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా నిలవడం ఖాయమనే నమ్మకాన్ని ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
నిధి రీసెంట్ గా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా తొలి సినిమా'మున్నామైకేల్' లో 'టైగర్ ష్రఫ్'(Tiger Shroff)హీరో.మూవీ ఒప్పుకున్నాక షరతులతో కూడిన కాంట్రాక్టుపై మేకర్స్ సంతకం చేయించుకున్నారు.ఆ కాంటాక్ట్ లో ఉన్న షరుతుల్లో నో డేటింగ్ ఒకటి.మూవీ పూర్తయ్యేవరకు టైగర్ తో నేను డేటింగ్ చేయడానికి వీల్లేదు.డేటింగ్ చెయ్యడం వలన హీరో,హీరోయిన్ లు ప్రేమలో పడితే నటనపై దృష్టి పెట్టరని మేకర్స్ ఉదేశ్యమని చెప్పుకొచ్చింది.
ఇక నిధి అగర్వాల్ పై ప్రస్తుతం బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేసినందుకు గాను హైదరాబాద్(Hyderabad)పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ కేసులో రాబోయే రోజుల్లో ఆమె విచారణకి కూడా హాజరయ్యే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
