లండన్‌లో హరిత... అల్లు అర్జున్ ఎక్కడా?
on Jan 4, 2025
బుల్లితెర నటుడు జాకీ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. అలాగే బుల్లితెర మీద నటించే హరిత గురించి ఆమె నటన గురించి కూడా మనకు తెలుసు. ఐతే హరిత రీసెంట్ గా లండన్ వెళ్ళొచ్చింది. అక్కడ మేడం టుస్సాడ్స్ ని కూడా విజిట్ చేసి ప్రతీ ఒక్క స్టాట్యూ దగ్గరకు వెళ్లి బాగా ఎక్సయిట్ అయ్యింది. ఐతే న్యూ ఇయర్ ని హరిత, ఆమె కూతురు సంస్కృతి లండన్ లో సెలెబ్రేట్ చేసుకున్నట్లు తన యూట్యూబ్ వీడియోలో చెప్పింది. ఐతే లండన్ కి వెళ్లేముందు పాస్పోర్ట్స్ అప్లై చేశామని పాస్పోర్ట్స్ ఓకే అయ్యాయని తెలిసిన వెంటనే లండన్ కి జాకీ టికెట్స్ బుక్ చేసినట్లు చెప్పారు.
ఇక తల్లి కూతుళ్లు ఇద్దరూ కలిసి కావల్సిన వస్తువుల్ని ప్యాక్ చేసుకున్నట్లు చెప్పారు. ఐతే తన కూతురికి స్పెషల్ హాలిడేస్ ఇచ్చాక తిరిగి స్కూల్ కి వెళ్ళినప్పుడు టీచర్స్ ఎక్కడికి వెళ్లావని అడిగేవారట.. ఐతే ఆమె ఎక్కడికీ వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను అని చెప్పేదట సంస్కృతి. ఐతే మిగతా ఫ్రెండ్స్ అంతా రకరకాల ప్లేసెస్ కి వెళ్ళాం అని చెప్పినప్పుడు తాను ఎక్కువగా బాధపడేదట. అందుకే ఈసారి ఎలాగైనా తనను ఎక్కడికైనా తీసుకెళ్లాలని డిసైడ్ ఐనట్లు చెప్పింది హరిత. అలా లండన్ వెళ్లి అక్కడ మేడం టుస్సాడ్స్ లో బాగా ఎంజాయ్ చేసినట్లు చెప్పారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ని పోస్ట్ చేసింది. "నటిని ఐనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతోమంది మహానుభావులను చూసాను అందరికీ వందనాలు" అంటూ పోస్ట్ చేసింది. ఐతే హరిత చాలా వరకు స్టార్స్ పక్కన నిలబడి రీల్ చేసింది కానీ అందులో అల్లు అర్జున్ స్టాట్యూని మిస్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే "ఏంటి మేడం అల్లు అర్జున్ ని మిస్ అయ్యారు ? అల్లు అర్జున్ ఎక్కడా ? " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read