నాని సినిమాల కోసం ఎగబడుతున్న నెట్ ఫ్లిక్స్..!
on Jan 30, 2024
మిగతా యంగ్ స్టార్స్ తో పోలిస్తే నేచురల్ స్టార్ నాని సినిమాల ఎంపిక చాలా బాగుంటుంది. విభిన్న జానర్ చిత్రాలు చేస్తూ సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తుంటాడు. నాని సినిమా అంటే ఎంతో కొంత విషయం ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగేలా చేసుకున్నాడు. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా నాని నటించిన చిత్రాలకు కనీస వసూళ్లు వస్తుంటాయి. ఓటీటీలో కూడా నాని సినిమాలకు విశేష ఆదరణ లభిస్తుంది. కుటుంబ ప్రేక్షకులు నాని సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకేనేమో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నాని సినిమాల డిజిటల్ రైట్స్ కోసం ఎగబడుతోంది.
'శ్యామ్ సింగరాయ్' నుంచి నాని నటిస్తున్న అన్ని సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్సే దక్కించుకుంటోంది. 'శ్యామ్ సింగరాయ్', 'అంటే సుందరానికీ', 'దసరా', 'హాయ్ నాన్న' ఇలా వరుసగా నాని నటించిన నాలుగు చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు నాని నటిస్తున్న కొత్త చిత్రం 'సరిపోదా శనివారం' డిజిటల్ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి. అది కూడా రికార్డు ప్రైస్ కి సొంతం చేసుకోవడం విశేషం.
'శ్యామ్ సింగరాయ్', 'అంటే సుందరానికీ', 'దసరా' సినిమాలకు నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణ లభించింది. ఇక ఇటీవల విడుదలైన 'హాయ్ నాన్న'కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 'సలార్', 'యానిమల్' సినిమాల హవాని తట్టుకొని కూడా నిలబడి.. రెండు వెర్షన్స్ లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది. నాని సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఫిదా అయిన నెట్ ఫ్లిక్స్.. ఆయన సినిమాల రైట్స్ కోసం ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలోనే, నాని గత చిత్రం 'హాయ్ నాన్న' డిజిటల్ రైట్స్ ని రూ.35 కోట్లకు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు 'సరిపోదా శనివారం' రైట్స్ ని ఏకంగా రూ.45 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇది నాని కెరీర్ లోనే హైయెస్ట్. ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తే.. భవిష్యత్ లో నాని నుంచి వచ్చే సినిమాలను ఇతర ఓటీటీ సంస్థలకు వదిలి పెట్టేలా లేదు నెట్ ఫ్లిక్స్.
Also Read