బోయపాటితో కాదు.. మెగాస్టార్ దర్శకుడితో 'NBK 109'!
on Jun 5, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల కానుంది. దీని తర్వాత బాలకృష్ణ చేయనున్న తన 109వ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్న బోయపాటి.. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తారని ఇటీవల అల్లు అరవింద్ ప్రకటించారు. మరోవైపు దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ కొల్లి)తో బాలయ్య ఓ సినిమా చేసే అవకాశముందని కూడా ఇటీవల న్యూస్ వినిపించింది. ఇప్పుడదే నిజం కానుందని తెలుస్తోంది. బాలయ్య 109 కి దర్శకుడు బోయపాటి కాదని, బాబీనే అని సమాచారం.
రచయితగా పలు సినిమాలకు పని చేసిన బాబీ.. 'పవర్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడిగా ఇప్పటిదాకా ఐదు సినిమాలు చేయగా.. 'సర్దార్ గబ్బర్ సింగ్' తప్ప మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య'తో ఈ ఏడాది అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య-బాబీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. అంతేకాదు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ మూవీ అధికారిక ప్రకటన రానుందట. ఈ సినిమాని సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)