గోల చేసిన పాపకు గాయాలయ్యాయి
on Nov 14, 2013
తన అనుమతి లేకుండా తన నడుము చూపించేసరని గోల గోల చేసిన నజ్రియా నజిమ్ ఇపుడు అందరికి తెలిసిందే. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం "వాయ్ మూడి పెసువోయ్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. మమ్ముట్టీ తనయుడు దుల్హర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మున్నార్ లో జరుగుతుంది. ఈ షూటింగ్ లో భాగంగా నజ్రియా స్కూటర్ నడుపుకుంటూ వచ్చే సీన్ ను చిత్రీకరిస్తుండగా, స్కూటర్ ను కంట్రోల్ చేయలేకపోవడంతో.. స్కిట్ అయ్యి కింద పడిపోవడంతో ఈ అమ్మడికి బాగానే గాయాలయ్యాయి. దాంతో వెంటనే ఈ అమ్మడిని హాస్పిటల్ లో చేర్పించారంట. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందట. కానీ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారంట.