కాబోయే భర్త ఎవరో చెప్పేసిన నయనతార..
on Mar 25, 2018
నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ మధ్య రిలేషన్ పై ఎప్పటినుండో రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా నయనతార మాత్రం ఎప్పుడూ ఈ వార్తలపై రియాక్ట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ నయనతార తనకు కాబోయే భర్త ఎవరో చెప్పేసింది. చెన్నైలో ఇటీవల మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్బంగా నయనతారకు ఎక్సెలెన్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అవార్డు దక్కింది. ఈ అవార్టు అందుకున్న ఆమె మాట్లాడుతూ....ఇప్పటి వరకు నేను హాజరైన అన్ని అవార్డుల ఫంక్షన్ అన్నింటిలోకి ఇదే గొప్ప ఫీలింగ్ కలిగించిన కార్యక్రం ఇదే అని... నా కెరీర్లో ఒడిదుడుకులకు లోనప్పుడు నాకు సపోర్ట్‌గా నిలిచిన అమ్మ, నాన్న, అన్నయ్య, నా కాబోయే భర్త అందించిన సహాకారం మరువలేనిది అని నయనతార అన్నారు. దీంతో బహిరంగ వేదికపైనే విగ్నేష్ శివన్ ను నాకు కాబోయే భర్త అని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ ఏడాదే వీరి పెళ్లి భాజాలు మోగడం ఖాయమని చర్చలు మొదలయ్యాయి. మరి చూద్దాం ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో...