Home

»

Latest News

అవునా..నయన్‌కు పెళ్లయిపోయిందా..?

Nov 18, 2016 3:49PM

హీరోయిన్లు-ప్రేమ వ్యవహారాలు విడదీయరానివి.. హీరోయిన్లు లైమ్‌లైట్‌లో ఉన్నంతకాలం ఎవరో ఒకరితో ప్రేమాయణం సాగిస్తూనే ఉంటారు. అలా లేని వారు చాలా అరుదని చెప్పవచ్చు. ఇక సౌత్ క్రేజీ హీరోయిన్ నయనతార సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే రెండుసార్లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి రేపో మాపో పెళ్లి అనుకుంటున్నవేళ ఆ ఇద్దరు హీరోలతో విడిపోవడం మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టడం వెంట వెంటనే జరిగిపోయింది. ఇంత జరిగినా సరే వెనుకడుగు వేయకుండా మరో లవర్‌ని వెతుక్కుంది..అతను ఎవరో కాదు తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.

ఇప్పుడు ఈ జంటకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నయన్ విఘ్నేశ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందని..కాని ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి రహస్యంగా ఉంచిందని చెన్నై జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇరు కుటుంబాల్లో ఈ విషయం తెలుసనీ, పెద్దలు ఈ జంటకు మద్ధతుగా ఉన్నారని అంటున్నారు. ఇటీవల ఓనమ్ పండుగను శివన్‌తో కలిసి చేసుకున్న నయనతార ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో ఆధారంగా జరిగిన ఇన్వెస్టిగేషన్‌లో అసలు గుట్టు బయటపడిందని కోలీవుడ్ కోడై కూస్తొంది. కొంతకాలం పాటు ఇలా సహజీవనం చేస్తున్నట్లుగానే నటించిన మంచి ముహూర్తం చూసి అసలు మ్యాటర్ బయటపెట్టాలని ఈ జంట ప్లాన్ అట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com