నయనతారా... ఈ ఎక్స్‌పోజింగ్ దాని కోసమేనా?
on Oct 14, 2023
హీరోయిన్లు ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయి. హీరోయిన్ల కెరీర్ ఎక్కువ సంవత్సరాలు కొనసాగే అవకాశం తక్కువ. కానీ, ఈమధ్యకాలంలో కొందరు హీరోయిన్లు సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. వారిలో నయనతార ఒకరు. 2003లో ఓ మలయాళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నయనతార హీరోయిన్‌గా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సౌత్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్న నయన్ దృష్టి బాలీవుడ్‌పై పడిరది.
ఇటీవల షారూఖ్‌ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమాలో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని, దీపికాపదుకొనే హీరోయిన్ అనిపించేలా వుందని నయన్ ఆమధ్య కామెంట్స్ చేసింది. అయితే బాలీవుడ్‌పై ఆమెకు మమకారం తగ్గలేదని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. హీరోయిన్లు తమ పాపులారిటీ పెంచుకునేందుకు సాధారణంగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కోసం ఫోటో షూట్స్ చేస్తుంటారు. అయితే ఈ ఫోటోలు ఎక్కువ శాతం ఎక్స్‌పోజింగ్‌తోనే ఉంటాయి. నయనతార చేసిన సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ తక్కువనే చెప్పాలి. ఆమె కెరీర్ ప్రారంభంలో వచ్చిన బిల్లా వంటి సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ బాగా చేసింది. ఆ తర్వాత ఆమెకు ఎక్స్‌పోజింగ్ చెయ్యాల్సిన అవసరం రాలేదు. హుందాతనంతో కూడుకున్న క్యారెక్టర్స్ చేస్తూ ఉండడంతో ఆమెను ఆ దృష్టితో ఎవరూ చూడడం లేదు. ఇప్పుడు తనకూ ఎక్స్‌పోజింగ్ అవసరం అన్నట్టుగా ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం సెక్సీ ఫోజులిచ్చింది. ఏమిటి.. నయన్ మనసు మార్చుకుందా, అందాల ప్రదర్శనపై మనసు పడిరదా అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
‘జవాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని, అందుకే మళ్ళీ ఎక్స్‌పోజింగ్ వైపు వెళ్లిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్‌లో తన అందాల్ని మరోసారి ఫోటోల రూపంలో అందరికీ పంచుతోంది. బాలీవుడ్‌ను ఆకర్షించేందుకే నయన్ ఈ ప్రయత్నాలు చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఈ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లు కూడా ఇదే కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



